రాష్ట్ర విభజన జరిగి ఏడు నెలలు కావస్తున్నా రెండు రాష్ట్రాల మధ్య వనరుల వంటి వాటి పంపిణీలో అనేక సమస్యలు ఎదురవు తున్నాయి. కేంద్ర ప్రభుత్వం విభజన చట్టాన్ని అమలు చేయడంలో జరుగుతున్న జాప్యం వల్ల ఇరు రాష్ట్రాల మధ్య తగాదాలు మరింత పెరుగు తున్నాయి. చివరకు విభజన చట్టాన్నే మార్చాలంటూ కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖా మంత్రి వెంకయ్యనాయుడు ప్రకటిస్తున్నారు. ఒకవైపు ప్రస్తుతమున్న చట్టాన్ని అమలు చేయకపోగా, మరోవైపున చట్టాన్నే సవరించాలన్న వాదన ముందుకొస్తున్నది. రాజ్యసభ సభ్యుల కేటాయింపు ప్రధాన సమస్యగా విభజన చట్టానికి మార్పులు కోరుతున్నారు. కానీ కీలకమైన సాగునీటి తగాదాలు, విద్యుత్ పంపిణీ తగాదాలు, ఉన్నత ఉద్యోగుల పంపిణీ తగాదాలు, సంక్షేమ నిధుల తరలింపు, హైదరాబాదు పోలీసులపై కేంద్ర పెత్తనం
కావాలని కోరడం లాంటి కీలక తగాదాలు ప్రతి రోజు చర్చనీయాంశాలు అవుతున్నాయి. ఈ తగాదాలను కేంద్రం పరిష్కరించాల్సి ఉంది. కానీ కేంద్రం కావాలనే తన బాధ్యతలను విస్మరిస్తున్నట్లు కనపడుతున్నది. రాజకీయంగా రెండు రాష్ట్రాలను తన అధీనంలోకి తెచ్చుకునే ఎత్తుగడలను అనుసరిస్తున్నట్లు ద్యోతకమవు తున్నది. ఈ తగాదాలు ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టిస్తున్నాయి.
విభజన చట్టం ఏం చెబుతున్నది? ''విభజన చట్టం లోని సెక్షన్ -2 (హెచ్) ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు, తెలం గాణకు 2011 జనాభా లెక్కల ప్రకారం 58.32: 41.68 శాతంగా ఉండాలి.'' సెక్షన్ 84 ప్రకారం '' కృష్ణా, గోదావరి నదులకు విడివిడిగా బోర్డులను ఏర్పాటు చేయాలి. కృష్ణా బోర్డుకు ఆంధ్రప్రదేశ్‌లో, గోదావరి బోర్డుకు తెలంగాణాలో కార్యాలయాలు ఉండాలి.'' సెక్షన్ 84 నుండి సెక్షన్ 91 వరకు నదీ జలాల పంపిణీపై వివరణ ఉంది. చట్టం 11వ షెడ్యూల్డ్‌లో (2) ప్రకారం గతంలో పంపిణీ చేసుకున్న విధానం ప్రకారం నీటి వినియోగం జరగాలి. కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పునకు లోబడి ఉండాలి. విద్యుత్ విషయంలో గత విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కొనసాగాలి. రెండు సంవత్సరాల వరకు రాష్ట్ర విద్యుత్ సరఫరాను ''సౌత్ ఎలక్ట్రిక్ డిస్పాచింగ్ లోడ్ సెంటర్ - బెంగళూరు'' వారి పర్యవేక్షణలో విద్యుత్ పంపిణీ జరగాలి. ఉమ్మడి రాష్ట్రంలో పంపిణీ జరిగిన విధంగానే ఉత్పత్తిలో తెలంగాణాకు 54 శాతం, ఆంధ్రాకు 46శాతం వాటా ఉండాలి.
కానీ, 1996లో నాటి తెలుగుదేశం ప్రభుత్వం విడుదల చేసిన జీవో 69 ప్రకారం నాగార్జునసాగర్‌లో 510 అడుగుల నీరు ఉన్నప్పుడు నీటి విడుదలలు నిలిపివేయాలి. హైదరాబాదుకు మాత్రమే త్రాగునీరు ఇవ్వాలి. ఆ తర్వాత వచ్చిన జీవో 107 ప్రకారం శ్రీశైలంలో గతంలో నిర్ణయించిన 69 జీవో డెడ్ స్టోరేజీ లెవల్ 834 నుండి 854కు పెంపుదల చేయడం జరిగింది. ఆ జీవో ప్రకారం 854 అడుగులు ఉన్నప్పుడు శ్రీశైలం నీటి విడుదలలు ఆపివేయాలి. కానీ, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయించిన 834 అడుగుల శ్రీశైలం డెడ్‌స్టోరేజ్ నీటి మట్టానికి తక్కువగా ఉన్నా విద్యుత్ ఉత్పత్తికి నీటిని ఉపయోగించాలి. చివరకు 770 అడుగుల వరకు కూడా నీటిని వినియోగించాలి. 854 అడుగులకు పెంచుతూ అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి 107 జీవో తెచ్చినప్పుడు, చంద్రబాబునాయుడు, నేటి ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖా మంత్రి దేవినేని ఉమ నాడు ప్రకాశం బ్యారేజీ వద్ద ఈ జీవోను వ్యతిరేకిస్తూ రాజశేఖరరెడ్డి రాయలసీమకు అమ్ముడు పోయాడని ధర్నాలు చేశారు. నీటి నిలువలను బచావత్ తీర్పు ప్రకారం వినియోగించాలి. దాని ప్రకారం తెలంగాణాకు 337.45 టిఎంసీలు, ఆంధ్రాకు 473.55 టిఎంసీలు వినియోగించాలి. కానీ 2014-15 సంవత్సరంలో లభ్యతనీరు 549.65 టిఎంసీలు మాత్రమే వచ్చింది. పై దామాషా ప్రకారం - అనగా తెలంగాణా 41.68శాతం, ఆంధ్రప్రదేశ్ 58.32శాతం - పంపిణీ చేసుకోవాలి. నేటికి ఆంధ్రప్రదేశ్ తన వాటా మొత్తం వినియోగించుకుంది. తెలంగాణా 112 టిఎంసీలు వినియోగించుకోవాల్సి ఉంది. ఈ వాస్తవం తెలిసినప్పటికీ కృష్ణా బోర్డును ప్రభావితంచేసి దిగువకు నీటి విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. కేంద్రం గత ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం పరిష్కరిస్తే తగాదా సమసిపోతుంది. అలాగే విద్యుత్ వినియోగంలో రెండు రాష్ట్రాల ఉత్పత్తిలో 54శాతం తెలంగాణకు, 46శాతం ఆంధ్రప్రదేశ్‌కు పంపిణీ జరిగితే తగాదాకు ఆస్కారం ఉండదు. పులిచింతలలో నీటిని నిలువచేయడం ద్వారా ముంపునకు గురైన గ్రామాల ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిహారం చెల్లించాల్సి ఉంది. పరిహారం చెల్లించకుండానే 12 టిఎంసీల నీటిని నిలువచేయాలని నిర్ణయించడంతో నల్గొండ జిల్లాలోని అనేక గ్రామాలు, పంట పొలాలు నీటి ముంపునకు గురవుతున్నాయి. నాగార్జునసాగర్ ముంపు గ్రామాల ప్రజలకు నేటికీ పరిహారం చెల్లించకపోవడం గమనార్హం. తిరిగి తమకూ అదేగతి పడుతుందని పులిచింతల ముంపు బాధితులు భావించడంలో తప్పులేదు. రాష్ట్రంలో ఇంత వరకు నిర్వాసితుల సమస్యలను సక్రమంగా పరిష్కరించిన ప్రభుత్వాలు లేవు. చివరకు న్యాయమైన పరిష్కారం కోరితే కాల్పుల వరకు తెచ్చి సమస్యను పక్కదారి పట్టిస్తున్న సందర్భాలు ఉన్నాయి.
పై ప్రాజెక్టుల ద్వారా లబ్దిపొందుతున్నవారు కొందరైతే, వారి కోసం నష్టపోతున్నవారు మరికొందరు. కేంద్ర ప్రభుత్వం విభజన చట్టాన్ని అమలు చేయడానికి ఇరు రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి సమస్యలను పరిష్కరించాలి. విభజన చట్టంలో 108 సెక్షన్స్, 13 షెడ్యూల్స్ ఉన్నప్పటికీ వాటిని అమలు జరపడానికి తగిన యంత్రాంగం లేకపోవడం శోచనీయం. ఈ రెండు రాష్ట్రాల తగాదాలను పరిష్కరించలేమని జాతీయ రెగ్యులేటరీ కమిషన్, ''సౌత్ ఎలక్ట్రిక్ డిస్పాచింగ్ లోడ్ సెంటర్ - బెంగళూరు'' వారు నిరాసక్తతను ప్రకటించారు. తాము ఈ సమస్యను పరిష్కరించలేమని, మీలో మీరే పరిష్కరించుకోవాలని వదలివేశారు. అంతేకాదు, చివరకు కృష్ణా రివర్‌బోర్డు కూడా పరిష్కరించలేమని అశక్తతను వెలిబుచ్చడంతో నీటి తగాదా కేంద్ర బోర్డు వద్దకు వెళ్లింది. కేంద్ర బోర్డులో కేంద్రమంత్రి ఉమాభారతి అధ్యక్షులుగా, ఇద్దరు ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉన్నారు. అక్కడకు వెళ్లినా సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. చట్టాలు, జీవోలు, కేంద్ర ప్రభుత్వ సూచనలు ఎన్ని ఉన్నా, సమస్యలు జటిలమవుతూనే ఉన్నాయి. ఇది రెండు రాష్ట్రాల అభివృద్దికి ఆటంకంగా తయారవుతుందనడంలో సందేహం లేదు.
నేటికీ ఐఎఎస్, ఐపిఎస్ అధికారుల పంపిణీ జరగకపోవడంతో పరిపాలన స్తంభించిపోయింది. ఏ శాఖలోనూ ప్రభుత్వ నిర్ణయాలు అమలు జరగడం లేదు. చివరకు ప్రభుత్వాలు ప్రకటిస్తున్న సంక్షేమ పథకాల అమలుకు కూడా ఆటంకాలు ఏర్పడ్డాయి. సంక్షేమ శాఖ తదితర నిధులను పంపిణీ చేసుకోవాల్సి ఉండగా, పరిష్కారానికి భిన్నంగా నిధులు తరలిపోతున్నట్లు తెలంగాణా ప్రభుత్వం ఆరోపణలు చేస్తున్నది. సంక్షేమ శాఖ నుండి రు.620 కోట్లు తరలిపోయినట్లు ఆరోపించింది. నిధుల పంపిణీని కేంద్ర సహకారంతో చేసుకోవాలి.
హైదరాబాదు నగర పోలీస్ వ్యవస్థపై కేంద్రం ఆధిపత్యం ఉండాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరుతున్నది. తెలంగాణలో నివసిస్తున్న ఆంధ్రా వారికి రక్షణ లేనప్పుడు గవర్నర్ ద్వారా కేంద్రాన్ని కోరే హక్కు ఆంధ్రప్రదేశ్‌కు ఉంది. శాంతిభద్రతల పరిరక్షకుడిగా గవర్నర్ మరొక కార్యదర్శిని నియమించుకునే అధికారం కేంద్రం కల్పించింది. అనేక సందర్భాల్లో రాష్ట్ర గవర్నర్ ఉభయ రాష్ట్రాల్లో శాంతి భద్రతలు బాగానే ఉన్నాయనీ, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్దిలో పోటీ పడుతున్నాయని కితాబులిచ్చారు. ఒకవైపున కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు - రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కితాబులిస్తుండగా, మరోవైపు రాష్ట్ర వనరుల పంపిణీ సమస్యతో ఇరు రాష్ట్రాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి.
ఒక విధంగా చూస్తే రెండు ప్రభుత్వాలు ప్రజల దృష్టిని ప్రధాన సమస్యల నుండి ఈ సమస్యలవైపు మళ్లించే విధంగా ప్రయత్నిస్తున్నట్లు కనపడుతున్నది. తమ ఎన్నికల హామీలను అమలు జరపడంలో వస్తున్న వైఫల్యాలకు, ప్రజలు తెలుపుతున్న నిరసనలను ప్రక్కదారి పట్టించడానికే ఈ తగాదాలను ఎజెండామీదకు తెస్తున్నారు. రైతుల రుణమాఫీ, పెన్షన్ల పంపిణీ, కేజీనుండి పీజీ వరకు ఉచిత విద్య, ఫీజు రియింబర్స్‌మెంట్, దళిత - గిరిజనులకు ప్రకటించిన సంక్షేమ పథకాలు (కుటుంబానికి మూడెకరాల భూమి), కల్యాణలక్ష్మి, మనవూరు-మన ప్రణాళిక ద్వారా గ్రామాల అభివృద్ధి, లక్ష ఉద్యోగాలు, రోజుకు 8గంటల విద్యుత్ సరఫరా, మూడు లక్షలతో పేదలకు డబుల్ బెడ్‌రూం ఇల్లు, చట్టసభల్లో మహిళలకు-బిసీలకు 33.3శాతం రిజర్వేషన్లు, వాడవాడకు సిమెంట్‌రోడ్స్- ఇంటికొకచెట్టు-డ్రైనేజ్, నూతన రాజధాని ఏర్పాటు తదితర అంశాలను ఘనంగా ప్రకటించిన ప్రభుత్వాలు వాటిని అమలు చేయడానికి నిధులు అనుమతించకపోవడంతో ప్రజలను తప్పుదారి పట్టించడానికే ఉభయ రాష్ట్రాల మధ్య తగాదాలను పరిష్కారం కాకుండా సాగదీస్తున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
ప్రతిరోజూ ప్రకటనల ఆర్భాటం ఘనంగా ఉన్నా, ప్రజల గత పరిస్థితుల్లో ఎలాంటి మార్పూ చోటు చేసుకోలేదు. రెండు రాష్ట్రాల్లో ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. వాటి గురించి పట్టించుకున్నవారే లేరు. ఉభయ రాష్ట్రాల్లో మూడింట రెండు వంతుల ప్రాంతంలో కరువు ఏర్పడినట్లు ప్రభుత్వాలే ప్రకటించాల్సి వస్తున్నది. రబీ ఉత్పత్తులు సగం కూడా వచ్చే అవకాశం లేదు. చిన్న-మధ్యతరగతి పరిశ్రమలు మూతపడుతున్నాయి. నిరుద్యోగం పెరుగుతున్నది. కనీసం ప్రభుత్వంలో ఏర్పడిన ఖాళీ ఉద్యోగాలను కూడా నింపే పరిస్థితి లేదు. అయినా, ఇద్దరు ముఖ్యమంత్రులు పోటీ పడి సింగపూర్, మలేసియా, జపాన్ తిరుగుతూ '' పెట్టుబడిదారులారా మా రాష్ట్రానికి రండి - మీరు పెట్టుబడులు పెట్టండి, లాభాలు తరలించుకుపోండి'' అంటూ పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తున్నారు. ఇప్పటికే ఉభయ రాష్ట్రాలకు రు.1,80,000 కోట్లు అప్పు ఉంది. దీని వడ్డీల చెల్లింపులకే రు.8,000 కోట్లు ఏటా రెండు రాష్ట్రాలు వ్యయం చేస్తున్నాయి. ప్రజలను ఇంకా రుణగ్రస్తులను చేయడానికే అభివృద్ధి మంత్రం జపిస్తూ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు. గత జలయజ్ఞంలో వ్యయం చేసిన రు.82,000 కోట్లల్లో ఎంత పెద్దమొత్తం కాంట్రాక్టర్లపరం అయ్యిందో నేటికీ తేల్చలేదు.
ఇప్పటికైనా ప్రభుత్వాలు ప్రజలను ప్రక్కదారి పట్టించకుండా ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను సత్వరం పరిష్కరించుకోవాలి. తద్వారా మాత్రమే ఉభయ రాష్ట్రాల ప్రభుత్వాలు కోరుతున్న విధంగా స్వర్ణాంధ్రప్రదేశ్, బంగారు తెలంగాణాలు కాకున్నా, కనీసం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేయాలి. ఇందుకు కేంద్రం జోక్యం చేసుకుంటే తప్ప పై సమస్యలు పరిష్కారం కావు.
- సారంపల్లి మల్లారెడ్డి

No comments:
Post a Comment