'మేక్ ఇన్ ఇండియా' నినాదంతో భారత ఉత్పత్తులను ప్రపంచ దేశాల నలు మూలల్లో విక్రయిస్తామన్న ప్రధాని మోడీ ఉద్దేశాన్ని హర్షించాల్సిందే. అయితే ఇందుకు గాను దేశాన్ని అతిపెద్ద పారిశ్రామిక ఉత్పత్తి హబ్‌గా మార్చుతామని, చైనా తరహా ఎగుమతులను అందిపుచ్చు కుంటామన్న ఆయన సంకల్పానికి వాస్తవ పరిస్థితుల మధ్య పెద్ద అగాధమే ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో చైనా తరహా ఎగుమతుల కంటే ఆ దేశ ప్రజల కొనుగోలు శక్తి తరహాను భారతీయులకు ఎలా అందించాలన్న లక్ష్యాన్ని పెట్టుకోవడం ఉత్తమం. దీనికి భిన్నంగా ప్రజల కొనుగోలు శక్తిని హరించేలా కార్మిక చట్టాలను చేయడం, సంఘటిత రంగాన్ని కుదించడం, ప్రభుత్వ రంగాన్ని బలహీనపర్చడం లాంటి చర్యలు కొనుగోలు శక్తిని మరింత హరిస్తున్నాయి. దీనికి తోడు డీజిల్, పెట్రోల్, గ్యాస్ తదితర ఇంధన ధరలను మార్కెట్ శక్తులకు వదిలిపెట్టడం ద్వారా ప్రభుత్వం వినియోగదార్లపై భారం మోపుతోతున్నది. బిజెపి ప్రభుత్వం అంతర్జాతీయ, జాతీయ వాస్తవ పరిస్థితులను అంచనా వేసి ''మేక్ ఇన్ ఇండియా''పై
దృష్టి సారిస్తే సత్ఫలితాలు వస్తాయి. ఇప్పటికే భారత్‌లో గత ఐదు మాసాల నుంచి వరుసగా పారిశ్రామికోత్పత్తి పడిపోతున్నది. మరోవైపు ఉత్పత్తి అవుతున్న సరుకులకు ఎగుమతులు లేక ఆ వర్గాలు దిగాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ముందుగా దేశీయంగా ప్రజల కొనుగోలు శకిన్తి పెంచడంపై దృష్టి సారించాలి. ''మేక్ ఇన్ ఇండియా'' విధానం అనుసరణీయం కాదని స్వయంగా రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా గవర్నర్ రఘురాం రాజన్ పేర్కొన్న విషయం తెలిసిందే. ''చైనా తరహాలో ఎగుమతి తరహా దేశంగా, తయారీ రంగాన్ని అభివృద్ధి చేయాలన్న ప్రధాని మోడీ ఆలోచనలు ప్రస్తుత కాలమానానికి, భారత ఆర్థిక వ్యవస్థకు సరిపోవు.'' అని రాజన్ స్వయంగా వ్యాఖ్యానించారు. మోడీ నినాదంతో కుప్పలు, తెప్పలుగా సరుకులు ఉత్పత్తి చేసి ఎక్కడ విక్రయించుకోగలం? అమెరికా, యూరప్ దేశాల్లో ఇప్పటికే డిమాండ్‌లో స్తబ్ధత ఏర్పడింది. ప్రస్తుత పరిస్థితుల్లో మేక్ ఇన్ ఇండియా కంటే 'భారతీయుల కోసం ఉత్పత్తులు' (మేక్ ఫర్ ఇండియా) అనే నినాదంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు పోతే సత్ఫలితాలు వస్తాయి. ఇందుకోసం దేశంలోని ప్రజల కొనుగోలు శక్తిని పెంచడానికి స్వల్ప కాలిక, దీర్ఘ కాలిక పథకాల కోసం తక్షణ చర్యలు తీసుకోవాలి.
చైనీయుల కొనుగోలు శక్తి నాలుగు రెట్లు అధికం
భారత్‌తో పోల్చితే చైనీయుల కొనుగోలు శక్తి నాలుగు రెట్లు ఎక్కువ.. ఓ అంతర్జాతీయ సంస్థ వెల్లడించిన 2011 నివేదికలో భారత్‌లో నెలకు సగటు వేతనం రూ.2500 (45 డాలర్లు) కాగా, చైనాలో ఈ రేటు 182 డాలర్లుగ (రూ.10,111)గా అంచనా వేసింది. చైనా జిడిపిలో తలసరి ఆదాయం రూ.11,868 డాలర్లు కాగా, భారత్‌లో ఇది 5,450 డాలర్లుగా ఉంది. భారత్‌లో 2.75 కోట్ల మంది సంఘటిత రంగంలో పని చేస్తున్నారు. ఇందులో ప్రభుత్వ రంగ సంస్థల్లోనే 1.73 కోట్ల మంది ఉన్నారు. మొత్తంగా 48.7 కోట్ల మంది కార్మికులు పని చేస్తున్నారని అంచనా. సుమారు 94 శాతానికి పైగా కార్మికులు అసంఘటిత రంగంలో, ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు లేకుండా పని చేస్తున్నారు. చైనాలో మొత్తంగా 79.5 కోట్ల కార్మికులు, ఉద్యోగులు పని చేస్తున్నారు. చైనాలో 10 కోట్ల మంది ప్రజలు సంఘటిత రంగంలో పని చేస్తున్నారని అంచనా. 2009-10 గణాంకాల ప్రకారం భారత్‌లో 5-14 ఏళ్ల లోపున్న 49.8 లక్షల బాలకార్మికులు పనిలో ఉన్నారు. 25 శాతం నిరుద్యోగిత ఉంది. అదే చైనాలో 5 శాతం నిరుద్యోగిత మాత్రమే ఉంది.
భారత పరిస్థితులకు అద్దం పట్టే ఉదాహరణ.. గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక ప్రజలు దారిద్య్ర రేఖకు దిగువనే ఉన్నారు. ఇక పట్టణ ప్రాంతాల విషయానికి వస్తే.. ఇక్కడి పెద్ద పరిశ్రమలు, చిన్న పరిశ్రమలు, స్టోర్లు, సినిమా టాకీసులు, నిర్మాణ రంగ కార్మికులు, సెక్యూరిటీ గార్డులు, ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ కాంట్రాక్టు పని చేసే వారి వేతనం సగటున రూ.6,000-7,000గా ఉంటుంది. ఇందులో అద్దె పోగా, పూట గడవడానికే వారికి కష్టమవుతుంది. నగరాల్లోని 70-80 శాతం ప్రజలు ఇదే తరహా జీవన పరిస్థితులను కలిగి ఉన్నారు. వీరు టివి, ఫ్రిజ్, వాషింగ్‌మిషన్, మిక్సర్ తదితర ఏ గృహౌపకరణ పరికరం కొనుక్కోవాలన్నా కష్టమే. ఏడాది పొడువునా పొదుపు చేస్తే ఒక్క పరికరం కొనుక్కోవడం గగనం. ఇలాంటి వారిలో కొనుగోలు శక్తిని పెంచకుండా దేశీయంగా డిమాండ్ తీసుకురాలేం. ఈ నేపథ్యంలోనే వీరందరినీ సంఘటిత రంగంలోకి తీసుకురావడంతో పాటు యాజమాన్య లాభాల్లోనూ వీరికి వాటా కల్పించడం ద్వారా ప్రజల కొనుగోలు శక్తిని పెంచడానికి వీలుంటుంది. చైనాలో ప్రభుత్వ రంగం కీలక పాత్ర పోషిస్తున్నది. ప్రయివేటు సంస్థలు కూడా ప్రభుత్వ కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. అక్కడి కార్మికులకు, ఉద్యోగులకు ఆ దేశం అత్యంత ప్రాధాన్యత నిస్తున్నది.
కార్మికుల హక్కులకు ఎసరు
భారత్‌లో కార్మికుల కొనుగోలు శక్తిని పెంచాల్సిన కేంద్ర ప్రభుత్వం వారి హక్కులను కార్పొరేట్, ప్రయివేటు కంపెనీల చేతుల్లో పెట్టడానికి వినాశకర కార్మిక చట్టాలను అమల్లోకి తీసుకువస్తున్నది. ఇప్పటికే ఏ ప్రయివేటు రంగంలోనూ పెద్దగా ఉద్యోగ భద్రత లేదు. కాంట్రాక్టు విధానం పెరిగిన కొద్దీ ప్రజల కొనుగోలు శక్తి మరింత క్షీణిస్తుంది. దేశంలోని సంఘటిత కార్మికశక్తిని కూలీలుగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాల సవరణ బిల్లును పెట్టింది. దీంతో 70 శాతం అసంఘటిత కార్మికుల బతుకు చిద్రం కానుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వారు పూర్తిగా ఉద్యోగ భద్రతను కోల్పోనున్నారు. ఈ చట్టం వల్ల ఇఎస్‌ఐ, పిఎఫ్, బోనస్, గ్రాట్యుటీ తదితర వాటిని స్వయంగా కార్మికులు చెల్లించుకునే దుస్థితి రానుంది.
దిగజారుతున్న పారిశ్రామికోత్పత్తి
బిజెపి సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేక్ ఇన్ ఇండియాకు ఇప్పటికే ప్రతికూల ఫలితాలతో పాటు మరిన్ని సంకేతాలు వస్తున్నాయి. మోడీ అధికారంలోకి వచ్చిన కొత్తలో రెండు మాసాలు మినహా ప్రతి నెలా పారిశ్రామిక ఉత్పత్తి పడిపోతున్నది. గత రెండు, మూడు మాసాల్లో చోటు చేసుకున్న వృద్ధి రేటు పతనం, ఎగమతులు డీలా, ప్రజల కొనుగోలు శక్తి తగ్గడంతో వస్తు అమ్మకాల డిమాండ్‌లో స్తబ్ధత తదితర పరిణామాలే ఇందుకు నిదర్శనం. ఈ ఏడాది అక్టోబర్ మాసంలో భారత పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపి) ఏకంగా -4.2 శాతం ప్రతికూల వృద్ధిరేటును నమోదు చేసుకుంది. ఐఐపిలో 75 శాతం వాటా కలిగిన తయారీ రంగం క్రితం అక్టోబర్ ఉత్పత్తిలో -7.6 శాతం ప్రతికూలతను ప్రదర్శించింది. గృహౌపకరణాల ఉత్పత్తుల డిమాండ్‌లో స్తబ్ధత వల్ల ఈ రంగం ఏకంగా -35.2 శాతం ప్రతికూల వృద్ధి రేటును చవి చూసిందంటే ప్రజల కొనుగోలునూ అంచనా వేయవచ్చు. 22 పరిశ్రమల గ్రూపులో 16 రంగాలు ప్రతికూల వృద్ధి రేటును ఎదుర్కున్నాయి.
ఎగుమతులు సులువేమీ కాదు
చైనా తరహా వ్యూహాన్ని మనం అమలు చేయడం సులువేమీ కాదు. ఎందుకంటే అంతర్జాతీయ ఎగుమతి కేంద్రంగా మారాలంటే ఎగుమతిదార్లకు భారీ రాయితీలు ఇవ్వాలి. ముడి సరుకులను చౌకగా లభించేలా చేయాలి. దేశీయంగా ఏకీకృత మార్కెట్‌ను సృష్టించేందుకు ముందుగా ఇక్కడి డిమాండ్‌ను చేజిక్కించుకోవడంపై ప్రభుత్వాలు, కంపెనీలు దృష్టి పెట్టాలి. నాణ్యతతో కూడిన ప్రపంచ మార్కెట్లో పోటీ పడే ఉత్పత్తులను అందించాలి. చైనా తరహా ఎగుమతులు, వృద్ధి సాధిస్తామని మోడీ పదే పదే పేర్కొంటున్నారు. ఓ సోషలిస్టు దేశంతో పోటీపడటం అంత సులువు కాదు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎగుమతుల కంటే దిగుమతుల్లోనే భారీ వృద్ధి చోటు చేసుకోవడం గమనార్హం. సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో దిగుమతులు పెరిగి, ఎగుమతులు తగ్గి వాణిజ్య లోటు 38.6 బిలియన్ డాలర్లకు చేరింది. ముఖ్యంగా ప్రపంచ మార్కెట్లో డిమాండ్ సన్నగిల్లడం, భారత ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లో పోటి పడలేకపోవడం వల్ల ఎగుమతుల్లో క్షీణత చోటు చేసుకుంటుంది.
సగానికి తగ్గిన కంపెనీల రిజిస్ట్రేషన్
పారిశ్రామిక రంగానికి పెద్దపీట వేస్తామన్న బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత కంపెనీల రిజిస్ట్రేషన్‌లో భారీ తగ్గుదల చోటు చేసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2014-15) ఏప్రిల్ నుంచి ఆగస్టుతో ముగిసిన ఐదు మాసాల కాలంలో దేశంలో కొత్త కంపెనీల నమోదు సగానికి తగ్గిపోయింది. ఈ కాలంలో మొత్తంగా 21,260 కంపెనీల రిజిస్ట్రేషన్ జరిగిందని స్వయంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీయే పేర్కొన్నారు. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 43,601 కంపెనీలు నమోదయ్యాయి.
అంతరానికి భరతం పట్టాలి
భారత్‌లో గత దశాబ్దంన్నర నుంచి ఎప్పుడూ లేనివిధంగా అంతరాలు పెరుగుతున్నాయని ఓ అంతర్జాతీయ నివేదిక వెల్లడించింది. మన దేశంలో పైస్థాయిలో ఉన్న 10 శాతం ధనికుల సంపద 2000 ఏడాది నుంచి భారీగా పెరుగుతూ వచ్చి ప్రస్తుతం దేశ సంపదలో మూడో వంతు వీరి వద్దే ఉంది. ప్రపంచంలోనే మధ్య తరగతి ప్రజలు చైనాలో అత్యధికంగా ఉన్నారు. అక్కడ దశాబ్దంన్నర కాలంలో మధ్య తరగతి వారు గణనీయంగా పెరిగారు. ఈ సంఖ్య భారత్‌లో కంటే పది రెట్లు ఎక్కువగా ఉంది. ఆదాయాల మధ్య ఉన్న అంతరాన్ని తెలియజేసే సూచిక గినికోఫిసియెంట్ నివేదిక కూడా ఇదే చెబుతున్నది. భారత్‌లో అంతరాలను తగ్గించాలంటే కార్మికులను సంఘటిత రంగంలోకి తీసుకురావాలి. పనికి తగ్గ వేతనం కల్పించాలి. పేదలకు సబ్సీడీలను పెంచాలి. కార్పొరేట్ వర్గాల పన్ను ఎగవేతలపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు పన్ను చెల్లింపులను కఠినతరం చేయాలి. వీటికి తోడు ఇంధన ధరలను తగ్గించడం ద్వారా ప్రజల కొనుగోలు శక్తిని పెంచడానికి చర్యలు తీసుకోవడం మాత్రమే దేశ ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుంది. ఆ వైపు కేంద్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరిస్తే ప్రజల జీవన ప్రమాణాల్లో మెరుగైన ఫలితాలు ఆశించవచ్చు.
- చిట్యాల మధుకర్

No comments:
Post a Comment