కార్పొరేట్, ఫ్యూడల్ జాయింట్ వెంచర్
మోడీజీ, మీరూ, ఒబామా కలిసి అమెరికాలోని
'వాషింగ్టన్ పోస్టు' దిన పత్రికలో ఒక సంయుక్త
సంపాదకీయం రాశారు. అందులో ఇలా ఉంది 'మన
సంబంధాలు' ఫెడరల్ స్థాయిలోనే కాదు, రాష్ట్ర
స్థాయిలో, సివిల్ సొసైటీస్థాయిలో ఉంటాయి' అంటే
స్థానిక స్థాయి (అంటే గ్రామ స్థాయి) నుంచి మిలిటరీ
స్థాయి వరకు మన ఉభయ దేశాల మధ్య బంధం
ఇరుదేశాలను పెనవేసుకుపోవాలని మోడీ కోరిక అన్న
మాట. మోడీకి ఓటు వేసిన 31 శాతం ప్రజలారా,
మీరెవరికి ఓటు వేశారో గమనించండి.
రాచరిక వ్యవస్థ, ఇందిరా గాంధీ పాలనలో అత్యవసర పరిస్థితి, ప్రస్తుతం మోడీ పరిపాలన - ఈ మూడు వ్యవస్థల మధ్య విడదీయరాని ఏకత ఉన్నట్లు కనుపిస్తోంది. అది పరిపాలనలో, రాజకీయంలో, ఆర్థికంలో పూసలో దారంలా కానవస్తుంది. కొద్ది నెలల మోడీ పరిపాలనను గమనించి నప్పుడు కాస్త వెనక్కుపోయి పోలికలను,
బేధాలను గమనించాలని పించింది. రాచరిక వ్యవస్థలో సంస్థానాలను రాజులు వ్యక్తిగతంగా పరిపాలిస్తుండేవారు. రాజే సర్వాధికారి. అతని కింద మంత్రితో అవసరమొచ్చినప్పుడు సలహా సంప్రదింపులు జరిపినా, తుది నిర్ణయం రాజుదే. మహారాజులు చిన్న చిన్న సంస్థానాధీసులను నయానో, భయానో అవసరమైతే యుద్ధాలు చేసి తమ రాజ్య విస్తరణకు పాల్పడేవారు. ముస్లింలు పరిపాలించినా పాలన, రాజ్యాధికార విస్తరణ అదే పద్ధతిలో కొనసాగింది. బ్రిటిష్ పరిపాలన ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనతో ప్రారంభమై, దేశం స్వాతంత్య్రం సంపాదించిందనే దానికన్నా బ్రిటిష్ పాలకులు తమ అధికారాన్ని కాంగ్రెస్ నాయకులకు అప్పగించి నిష్క్రమించారనటం వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. చెప్పేదేమిటంటే, దేశంలో ఒకే వ్యక్తి పాలన (తెల్లవాడి పాలనలో బ్రిటిష్ మహారాణి) కొనసాగింది. ఈ ఫ్యూడల్ వ్యవస్థ నుంచి నెహ్రూ పాలనలో ప్రజాస్వామ్యం వైపు అడుగులేస్తూ వచ్చినా, ఇందిరాగాంధీ దేశంలో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) ప్రవేశపెట్టడంతో మళ్ళీ వ్యక్తి పాలనకు తెరలేచింది. ఆమె చెప్పిందే వేదం. కాదన్నవారిని జైళ్ళలో బంధించింది. అయితే తెలివిగా 20 సూత్రాల ప్రణాళిక అనే ముసుగు ధరించి ప్రజలను మభ్యపెట్టే లేదా తటస్థ వైఖరిని అవలంబించే దిశగా చర్య తీసుకుంది. ఇదీ వ్యక్తి పరిపాలనే. రాచరిక వ్యవస్థలో ఫక్తు ఫ్యూడల్ వ్యవస్థ కాగా, ఇందిరాగాంధీ ప్రజాస్వామ్య ముసుగులో సెమీ ఫ్యూడల్ వ్యవస్థ రాజ్యమేలింది. తదనంతరం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ప్రజాస్వామ్య ప్రభుత్వాల పాలనలో ప్రజాస్వామ్యం ఎంత ఉందంటే నేతి బీరలో నెయ్యి ఉన్నంత.
బేధాలను గమనించాలని పించింది. రాచరిక వ్యవస్థలో సంస్థానాలను రాజులు వ్యక్తిగతంగా పరిపాలిస్తుండేవారు. రాజే సర్వాధికారి. అతని కింద మంత్రితో అవసరమొచ్చినప్పుడు సలహా సంప్రదింపులు జరిపినా, తుది నిర్ణయం రాజుదే. మహారాజులు చిన్న చిన్న సంస్థానాధీసులను నయానో, భయానో అవసరమైతే యుద్ధాలు చేసి తమ రాజ్య విస్తరణకు పాల్పడేవారు. ముస్లింలు పరిపాలించినా పాలన, రాజ్యాధికార విస్తరణ అదే పద్ధతిలో కొనసాగింది. బ్రిటిష్ పరిపాలన ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనతో ప్రారంభమై, దేశం స్వాతంత్య్రం సంపాదించిందనే దానికన్నా బ్రిటిష్ పాలకులు తమ అధికారాన్ని కాంగ్రెస్ నాయకులకు అప్పగించి నిష్క్రమించారనటం వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. చెప్పేదేమిటంటే, దేశంలో ఒకే వ్యక్తి పాలన (తెల్లవాడి పాలనలో బ్రిటిష్ మహారాణి) కొనసాగింది. ఈ ఫ్యూడల్ వ్యవస్థ నుంచి నెహ్రూ పాలనలో ప్రజాస్వామ్యం వైపు అడుగులేస్తూ వచ్చినా, ఇందిరాగాంధీ దేశంలో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) ప్రవేశపెట్టడంతో మళ్ళీ వ్యక్తి పాలనకు తెరలేచింది. ఆమె చెప్పిందే వేదం. కాదన్నవారిని జైళ్ళలో బంధించింది. అయితే తెలివిగా 20 సూత్రాల ప్రణాళిక అనే ముసుగు ధరించి ప్రజలను మభ్యపెట్టే లేదా తటస్థ వైఖరిని అవలంబించే దిశగా చర్య తీసుకుంది. ఇదీ వ్యక్తి పరిపాలనే. రాచరిక వ్యవస్థలో ఫక్తు ఫ్యూడల్ వ్యవస్థ కాగా, ఇందిరాగాంధీ ప్రజాస్వామ్య ముసుగులో సెమీ ఫ్యూడల్ వ్యవస్థ రాజ్యమేలింది. తదనంతరం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ప్రజాస్వామ్య ప్రభుత్వాల పాలనలో ప్రజాస్వామ్యం ఎంత ఉందంటే నేతి బీరలో నెయ్యి ఉన్నంత.
ఇక్కడ మళ్ళీ రాచరిక వ్యవస్థలోకి పోతే రాజులు, వారి తదనంతరం వారి కొడుకులు లేదా భార్య, అన్నల పాలన వంశపారంపర్యంగా కొనసాగుతూ వచ్చినట్లు చరిత్ర పుస్తకాలు తెలియజేస్తున్నాయి. ప్రస్తుతం ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకుంటున్న మనదేశంలో నెహ్రూతో ప్రారంభమై ఆయన కుమార్తె ఇందిర, ఆమె కుమారుడు రాజీవ్, ఆయన భార్య సోనియా చక్రం తిప్పుతున్నారు. ఎన్నికల సమయంలో తమ వయస్సు దృష్ట్యా లేదా మరే ఇతర కారణాల వల్లనో ఎన్నికల్లో పోటీ చేయటానికి అవకాశం లభించని పరిస్థితుల్లో తమ కుమారునికైనా టికెట్ ఇవ్వాలని కోరటం చూస్తున్నాం. శాసనసభల్లో లేదా పార్లమెంటులో సభ్యుడెవరైనా చనిపోతే అతని భార్యకు టికెట్ ఇవ్వటం సర్వసాధారణం. ఎక్కడో ఎందుకు? చంద్రబాబు తన కుమారుణ్ణి రాజకీయ రంగ ప్రవేశం చేయిస్తున్నారు. మన కళ్ళముందరే తెలంగాణ ముఖ్యమంత్రి తన కుమారునికి, కుమార్తెకు, మేనల్లునికి అధికార పదవుల పందేరం చేసేశారు. తాజాగా ఆదర్శ ప్రధాని అనిపించుకుంటున్న మోడీ యశ్వంత్ సిన్హా పుత్రునికి మంత్రి వర్గంలో స్థానం కల్పించారు. ఫ్యూడల్ వ్యవస్థ కొనసాగుతుందనడానికి ఇవన్నీ కొన్ని నిదర్శనాలు. విశేషమేమంటే, ఒక పక్క రాచరిక వ్యవస్థ కొనసాగింపు, మరో పక్క పెట్టుబడిదారీ వ్యవస్థ, ఫ్యూడల్ వ్యవస్థకు గొడుగుపట్టడం - దేశం ఎక్కడకు పోతోంది. ఇది ప్రజాస్వామ్యం ముసుగులో రాచరిక వ్యవస్థ కాదా?
ప్రస్తుతం మోడీ పరిపాలనకు వస్తే ప్రధానిగా ఎన్నికైన వెంటనే చట్ట ప్రకారం ఎటువంటి అధికార పదవినీ చేపట్టడానికి వీలులేని ఒక మాజీ అధికారిని తన ప్రధాన కార్యదర్శిగా నియమించుకున్నారు. ఏ శాఖ మంత్రి ఏ నిర్ణయం చేయాలన్నా తన ఆమోదముద్ర పడాల్సిందే అనే మౌఖిక ఆదేశం జారీచేశారు. అన్ని శాఖల అధికారులను పోలీస్ పెరేడ్‌లోలా వరుసగా నిలబెట్టి ఆయనా నిల్చున్నారనుకోండి) వారెవరైనా ఏ నిర్ణయమైనా ముందు తన వద్దకు వచ్చి మాట్లాడిన తర్వాతే తీసుకోవాలని ఆదేశించారు. మామూలుగా మంత్రిమండలి సమావేశాలు జరిగినప్పుడు ఏయే అంశాలు చర్చకు వస్తాయో పత్రికల్లో వార్తలు వచ్చేవి. ఇప్పుడా పద్ధతికి విడాకులిచ్చినట్లు కనిపిస్తోంది. పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుణ్ణి కాబోయే ప్రధాని అనేది బ్రిటిష్ సంప్రదాయం. అయితే, ఆ ప్రతిపక్ష పార్టీకి నిర్దిష్టమైన సంఖ్యా బలం ఉండాలి. కాంగ్రెస్ పార్టీకి ఆ బలం లేనిమాట వాస్తవం. అయినా సత్సంప్రదాయం నెలకొల్పాలని ఉంటే ఆ పదవిని కాంగ్రెస్‌కు ఇచ్చి ఉండాల్సింది. ఈ విషయంపై స్పీకర్‌దే తుది నిర్ణయం. సాధారణంగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వ్యక్తే స్పీకర్ అవుతారు. కానీ ప్రస్తుత స్పీకర్ విశాల దృక్పథాన్ని అవలంబించలేక పోయారు. స్వాతంత్య్రానంతరం మొట్టమొదటి పార్లమెంటు సమావేశంలో కమ్యూనిస్టు నాయకుడు ఎకె గోపాలన్ ప్రతిపక్ష నాయకునిగా వ్యవహరించారు. (అధికారికంగా కాకపోయినా) ఆ మాటకొస్తే నీలం సంజీవరెడ్డి స్పీకర్‌గా ఎన్నికవడంతోనే తను పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అప్పటి స్పీకర్ మావ్‌లాంకర్, డిప్యూటీ స్పీకర్ అనంతశయనం అయ్యంగార్ రోల్ మోడల్‌గా వ్యవహరించారు. హిట్లర్‌ను గుర్తు చేసే మోడీకి, తన పార్టీ అగ్ర నాయకులనే ఉన్నత స్థానాల నుంచి దించేసిన మోడీకి అంత సంస్కారం, హృదయ వైశాల్యం ఎక్కడీ గత ప్రభుత్వాలలో లాగా నేటి మంత్రులు స్వతంత్రంగా వ్యవహరించలేక పోతున్నారు. పత్రికల వారితో తమ తమ మంత్రిత్వ శాఖల గురించి మాట్లాడినా అవి పత్రికల్లో ప్రచురించిన సందర్భాలు చాలా అరుదు. మోడీ అనే కత్తి నెత్తిన వేలాడుతుంటే ఎంత దమ్ముండాలి. తమ తమ నియోజకవర్గాల్లోని ప్రజలు తమ సమస్యలు పరిష్కరించమని వెళ్ళితే మంత్రులు, ఎంపీలు వారి మహజర్లు తీసుకోవటానికి భయపడతున్నారని ఇటీవలి పత్రికల్లో చదివా! తన పార్టీలోనే ప్రజాస్వామ్య పద్ధతులు అనుసరించని మోడీ ప్రజలకు ప్రజాస్వామ్య పరిపాలన ఎలా అందిస్తారు? 'మేక్ ఇన్ ఇండియా' అనే నినాదాన్నిచ్చారు మోడీ. ఇదేదో ఆషామాషీ నిర్ణయం కాదు. దేశ ఆర్థిక, పారిశ్రామిక విధానాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేసే నిర్ణయం. విదేశీ వస్త్రాలను వీధుల్లో కుప్పలుగా పోసి తగుల బెట్టి సామ్రాజ్యవాదాన్ని నిరసించిన చరిత్ర మనది. ఖద్దరు వస్త్రాలు ధరించటం ద్వారా విదేశీ పాలనకు వ్యతిరేకంగా పోరాటం సాగించారు మన ప్రజలు. అలాంటి నేపథ్యంలో విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడాన్ని పార్లమెంటు నిర్ణయం చేయలేదనే మాట అటుంచి, కనీసం మంత్రి మండలిలో చర్చించి నిర్ణయం తీసుకున్నారా? దేశం మొత్తాన్ని విదేశీ పెట్టుబడులకు ధారాదత్తం చేసే ఈ నిర్ణయం మోడీ ఒక వ్యక్తిగా (ఆయన ప్రధాని కావచ్చు) తీసుకున్న నిర్ణయం. నిర్ణయం తీసుకోవడమే కాదు, అమెరికా వెళ్లి అక్కడి బడా పారిశ్రామికవేత్తలను బొట్టుపెట్టి ఆహ్వానించి వచ్చారు. పరాయి దేశ వ్యక్తుల పెట్టుబడులతో 'హిందూ దేశం' అభివృద్ధి! మోడీజీ, మీరూ, ఒబామా కలిసి అమెరికాలోని 'వాషింగ్టన్ పోస్టు' దిన పత్రికలో ఒక సంయుక్త సంపాదకీయం రాశారు. అందులో ఇలా ఉంది 'మన సంబంధాలు' ఫెడరల్ స్థాయిలోనే కాదు, రాష్ట్ర స్థాయిలో, సివిల్ సొసైటీ స్థాయిలో ఉంటాయి'. అంటే స్థానిక స్థాయి (అంటే గ్రామ స్థాయి) నుంచి మిలిటరీ స్థాయి వరకు మన ఉభయ దేశాల మధ్య బంధం ఇరు దేశాలను పెనవేసుకుపోవాలని మోడీ కోరిక అన్న మాట. మోడీకి ఓటు వేసిన 31 శాతం ప్రజలారా, మీరెవరికి ఓటు వేశారో గమనించండి.
రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు పాలించినప్పుడు వారంతా కాంగ్రెస్ ప్రభుత్వం అనే పేరుతోనే కొనసాగారు. సంజీవరెడ్డి ప్రభుత్వం, వెంగళరావు ప్రభుత్వం, బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం అనే మాటలు ఎప్పుడూ వినలేదు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాలు అనే వారు, వాజ్‌పేయి ప్రభుత్వ కాలంలో కూడా బిజెపి ప్రభుత్వం అనే వారు. కానీ ఇప్పుడు మోడీ ప్రభుత్వం అనే మాటే వినబడుతోంది. పూర్వం రోజుల్లో కూడా కళింగ రాజ్యం, బహమనీ సుల్తానుల రాజ్యం అని వారి వంశాల పేర్లతో రాజ్యాలు వర్ధిలాయి. రాజుల పేర్లతో పిలిచిన దాఖలాలు లేవు. అక్కడక్కడ రాజుల (ఉదా: అశోకుడు, కృష్ణదేవరాయలు) పేర్లతో పిలిచారంటే వారు ప్రజలకు మంచి పరిపాలన అందించారు కాబట్టే. స్టాలిన్ ప్రభుత్వం, కృశ్చేన్ ప్రభుత్వం అని చరిత్రలో ఎక్కడా కన్పించదు. వాటిని కమ్యూనిస్టు ప్రభుత్వాలని పిలుస్తూ వచ్చారు. మరి ఇప్పుడో? ప్రభుత్వం బిజెపి పార్టీదైనా, ఆ పార్టీ పేరు మోడీ నోట ఎప్పుడూ విన్న గుర్తు లేదు. ఇది మోడీ ప్రభుత్వం. ఒక వ్యక్తి పరిపాలిస్తున్నాడు. ఆయనే ఈ దేశానికి రాజు, మహారాజు. మీకు ఫ్యూడల్ వ్యవస్థ గుర్తుకు రావటంలేదూ? అయితే ఒకటే తేడా. ఈ ఫ్యూడల్ వ్యవస్థ కార్పొరేట్ జెండా నీడలో ఎగురుతోంది. ఇది ఫ్యూడల్ కార్పొరేట్ వెంచర్.
- Written by : వి హనుమంతరావు
- Written by : వి హనుమంతరావు
No comments:
Post a Comment