Monday, November 3, 2014

కమ్యూనిస్టుల బలం తగ్గలేదు.. అందరూ మమ్మల్నే అనుసరిస్తున్నారు : తమ్మినేని

                                       హైదరాబాద్ : దేశంలో, రాష్ట్రంలో కమ్యూనిస్టుల బలం తగ్గిందని సాగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఓట్లు, సీట్లను బట్టి బలం పెరగడాన్ని, తగ్గడాన్ని బూర్జువా పార్టీలతోపాటు, కొందరు ప్రజానీకం అంచనా వేస్తున్నారని చెప్పారు. అయితే.. ఆ ఆలోచన విధానం సరైంది కాదన్నారు. ఇప్పటి వరకూ కమ్యూనిస్టులు చేసిన
పోరాటాలను, వారు చెప్తున్న మాటలనే ఇతర పార్టీలు అనుసరిస్తున్నాయని అన్నారు. మహిళా హక్కులు, భూముల పంపిణీ, ఎస్సీ, ఎస్టీ హక్కులు, అవినీతి.. మొదలైన అంశాలపై తొలి నుంచీ పోరాటం చేసింది కమ్యూనిస్టులేనని అన్నారు. ఇప్పుడు అందరూ వీటికోసం పోరాటాలు సాగిస్తున్నారని, ఇది కమ్యూనిస్టులు సాధించిన గొప్ప విజయంగా భావిస్తున్నామని తమ్మినేని చెప్పారు. అయితే.. ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే.. బూర్జువా పార్టీలన్నీ ఆయా అంశాలపై మాటలకు మాత్రమే పరిమితమవుతున్నాయని అన్నారు. ఇందుకు తగిన ఆచరణ కోసం కమ్యూనిస్టులు రెండో దశ పోరాటాన్ని కొనసాగిస్తున్నారని, అంతిమ విజయం దక్కే వరకూ ఈ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

No comments:

Post a Comment