Monday, November 3, 2014

పోలవరం డిజైన్ మార్చాల్సిందే : తమ్మినేని...


                       పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చాల్సిందేనని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. డిజైన్ మార్చకుండా నిర్మించడం వల్ల లక్షలాది మంది గిరిజనులు నిరాశ్రయులు అవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల తప్పని సరిగా డిజైన్ మార్చాలన్నారు. ఇందుకోసం జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసి, పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని చెప్పారు. ఎన్నికల సమయంలోనూ ఇందుకు ప్రయత్నిస్తున్నామని,
ఎన్నికల తర్వాత తమ కార్యాచరణ మరింత వేగవంతం చేస్తామన్నారు. అయితే.. దీనర్థం ఆంధ్రా ప్రాంత ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా పని చేస్తున్నట్లు కాదని స్పష్టం చేశారు. అక్కడి ప్రజల ప్రయోజనాలకు ఇబ్బంది లేకుండా, వారి లక్ష్యాలు నెరవేరే విధంగానే డిజైన్ లో మార్పు చేయొచ్చన్నారు. కానీ.. పాలకులు దీన్ని పెడచెవిన పెట్టారని అన్నారు.

No comments:

Post a Comment