ప్రచురణార్థం / ప్రసారార్థం :
హైదరాబాదు
హైదరాబాదు
పరిశ్రమలకు
రెండు రోజుల పవర్ హాలిడే వల్ల పారిశ్రామిక వాడలు మూతపడతాయని, యజమాన్యాలు
లౌకౌట్ల ప్రకటనకు సిద్దమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయని, ఇదే నిజమైతే
కార్మికుల జీవితాలు ఛిద్రమవుతాయని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఒక
ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే అనేక పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్‌కు
తరలిపోతున్నాయని, దీనివల్ల కొత్త పరిశ్రమలు ఎలా వస్తాయని శ్రీ తమ్మినేని
ప్రశ్నించారు. కాబట్టి విద్యుత్ సమస్య పరిష్కారం కోసం నిర్దిష్ట
ప్రతిపాదనలతో ''విద్యుత్‌రంగ నిపుణులు, ప్రతిపక్ష పార్టీల సమావేశం'' వేసి
చర్చించి పరిష్కార మార్గం చూడాలని శ్రీ తమ్మినేని కోరారు. ఎంత ఖర్చయినా ఇతర
రాష్ట్రాల నుండి
విద్యుత్‌ను కొంటానని ఒక సారి, విద్యుత్ లైన్లు
వేస్తున్నారు 10,15 రోజుల్లో పరిష్కారం అవుతాయని మరోసారి, మూడేళ్ల తర్వాత ఈ
సమస్యే ఉండదని ఇంకోసారి ప్రకటించడం చూస్తే సమస్యపై ప్రభుత్వానికి
స్పష్టతలేదని అన్నారు.
ఇంకో వైపు రైతాంగం చేలు ఎండిపోతున్నాయని పెద్ద
ఎత్తున ఆందోళనకు దిగుతున్నారు. ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతే తిరిగి వాటిని
అమర్చడానికి జాప్యం జరుగుతున్నది. ఇలా అయితే వ్యవసాయం ఎలా సాగుతుంది?
లాకౌట్ ప్రకటిస్తే అరకొర జీతాలతో కాలంగడుపుతున్న పారిశ్రామిక కార్మికుల
జీవితాలు ఏమవుతాయని ప్రశ్నించారు. కావున ఇప్పటికైన సిఎం చంద్రశేఖరరావు
విద్యుత్ సమస్యపై అఖిలపక్ష సమావేశానికి పిలవాలని కోరారు.

No comments:
Post a Comment