బీమారంగంలోకి ఎఫ్ డిఐలను ఆహ్వానిచండం ప్రమాదకరమని అఖిల భారత బీమా ఉద్యోగుల
సంఘం ఉపాధ్యక్షుడు వేణుగోపాల్ అన్నారు. 'బీమారంగం-ఎఫ్ డిఐలు, కేంద్రం
ప్రభుత్వం.. నిర్ణయం' అనే అంశంపై నిర్వహించన చర్చా కార్యక్రమంలో ఆయన
పాల్గొని, మాట్లాడారు. బీమారంగంలోకి ఎఫ్ డిఐల ప్రవేశం వల్ల దేశ ప్రజల
పొదుపు విదేశాల చేతుల్లోకి వెళ్తుందన్నారు. 'మన దేశ ప్రజల పొదుపు మన
ఆధీనంలోనే ఉండాలని' పేర్కొన్నారు. విదేశీపెట్టుబడి ప్రయివేట్ బ్యాంకుల్లో
మాత్రమే ఉండాలని... ప్రభుత్వ బ్యాంకుల్లో అవసరం లేదని చెప్పారు.
ఇన్సూరెన్స్ రంగంలో ప్రయివేట్ సంస్థలు, ఎఫ్ డిఐల ప్రవేశం ప్రమాదకరమన్నారు. ఎఫ్ డిఐల ప్రవేశం వలన ప్రజలకు కొత్తగా కలిగే ఉపయోగమేమి తేల్చి చెప్పారు. గతంలో ఎల్ ఐసిలోకి 28 శాతం ఎఫ్ డిఐలను ఆహ్వానించారని.. ఇప్పుడు దానిని 48 శాతానికి చేయాలని మోడీ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిపారు. అయితే కొత్త టెక్నాలజీ, కొత్తగా ఉద్యోగాలు వస్తే ఉత్పత్తి రంగంలోకి ఎఫ్ డిఐలను ఆహ్వానించడం తప్పుకాదన్నారు. కానీ ఎల్ఐసీ అంతకముందే టెక్నాలజీని కలిగివుందని గుర్తు చేశారు. భారతదేశంలో 60 కోట్ల మంది పొదుపు చేస్తున్నారని పేర్కొన్నారు. విదేశీ కంపెనీలపై ప్రజలకు నమ్మకం లేదని... ఎల్ ఐసి, ప్రభుత్వ సంస్థలపై ప్రజలకు నమ్మకం ఉందని స్పష్టం చేశారు. ఎల్ ఐసిలో ఎఫ్ డిఐల ప్రవేశానికి వ్యతిరేకంగా పోరాటాలను ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి ఆయన హెచ్చరించారు.
.
No comments:
Post a Comment