Tuesday, November 18, 2014

మతవాదాన్ని ప్రధానే ప్రోత్సహిస్తున్నారు : సీతారాం ఏచూరి


                     దేశంలో మతవాదాన్ని ప్రభుత్వం, ప్రధానే ప్రోత్సహిస్తున్నారని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు సీతారాం ఏచూరి విమర్శించారు. కాంగ్రెస్‌ ఆహ్వానం మేరకు నెహ్రూ 125వ జయంతి సందర్భంగా జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఏచూరి పాల్గొన్నారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రకారం దేశంలో ఉంది లౌకికవాద ప్రజాస్వామ్యమని ఆయన గుర్తు చేశారు. దాని పరిరక్షణ కోసం వామపక్షాలు మొదటి నుంచి కృషి చేస్తున్నాయని
ఏచూరి తెలిపారు. దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని 2004లో కాంగ్రెస్‌ నాయకత్వంలో ప్రభుత్వానికి మద్దతు ఇచ్చామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. నాడు వామపక్షాలకు 61 మంది ఎంపీలు ఉండగా అందులో 57 మంది కాంగ్రెస్‌ అభ్యర్థులపై విజయం సాధించినవారేనని ఆయన గుర్తు చేశారు.

No comments:

Post a Comment