తేది : 11.11.2014
ఉపాధి హామీ పథకానికి సవరణలు చేసి కుదించడానికి చేస్తున్న కేంద్రం
ప్రభుత్వ నిర్ణయాన్ని సిపిఐ(యం) తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా
ఖండిస్తున్నది. దేశవ్యాపితంగా ''మహత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ
పథకాన్ని'' 200 జిల్లాలకు మాత్రమే పరిమితం చేయాలని ప్రభుత్వం
నిర్ణయించింది. ఉపాధి హామీ పనుల్లో మెటీరియల్‌కు 40శాతానికి మించి
ఖర్చుపెట్టవద్దని పార్లమెంట్ చట్టం చేస్తే, ఈ ప్రభుత్వం దాన్ని 49శాతానికి
పెట్టవచ్చని సవరణ తెస్తున్నారు.
ప్రభుత్వం తెస్తున్న మార్పుల వల్ల
తెలంగాణ రాష్ట్రంలో 9 గ్రామీణ జిల్లాల్లో 443 మండలాలు ఉండగా వాటిలో 78
మండలాలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో
దాదాపు
అన్ని మండలాలు కరువు మండలాలే. ఉపాధి హామీ పథకం కుదించబడితే ప్రజల
జీవన పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రభుత్వం ఈ కుదింపును తక్షణమే
విరమించుకోవాలి.
ఈ పథకం ద్వారా ఏటా కోట్లాది మందికి పనిదినాలు
కల్పించబడుతున్నాయి. వామపక్ష పార్టీల ఉద్యమ ఫలితంగా మరియు పార్లమెంట్‌లో
వామపక్షాల చొరవతో నాటి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తెచ్చింది. ఈ పథకం వలన
ప్రజల కొనుగోలు శక్తి పెరచడం ద్వారా ఆర్థిక మాంధ్యం నుండి కేంద్ర
ప్రభుత్వాన్ని రక్షించింది. సంవత్సరానికి 100 రోజులు పని దినాలు
కల్పిస్తామన్న పథకంలో 40-60 రోజులు పనులు కల్పించబడ్డాయి. 2014-15
సంవత్సరానికి ఈ పథకానికి రు.35వేల కోట్లు కేటాయించారు. కాని బిజేపీ
ప్రభుత్వం అధికారానికి రాగానే ఈ పథకాన్ని కుదించే ప్రయత్నం జరుగుతున్నది.
ఇందుకు అమెరికా, ధనిక దేశాల ప్రోద్భలం కూడా ఉన్నది. భారతదేశ ప్రజలను
దారిద్య్రంలోకి నెట్టడానికి చేస్తున్న ప్రయత్నమే ఇది.
ప్రస్తుత కరువు
పరిస్థితుల్లో పనులు లేక వ్యవసాయ కార్మికులు, ఉపాధి హామీ పథకంపై
ఆధారపడినవారు వలసలు వెళ్తున్నారు. వాటి నిరోధానికి ఉపాధి హామీపథకాన్ని
అన్ని గ్రామాల్లో అమలు చేయాలి.
ఈ పథకం కుదించడానికి కేంద్ర ప్రభుత్వం
చేస్తున్న ప్రయత్నాన్ని నిరసిస్తూ నవంబర్ 26న అన్ని జిల్లాకేంద్రాల్లో,
రాష్ట్ర కేంద్రంలోనూ నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని ప్రజలకు
సిపిఐ(యం) తెలంగాణ కమిటీ విజ్ఞప్తి చేస్తున్నది.

No comments:
Post a Comment