Monday, November 17, 2014

విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. : సిఎంకు తమ్మినేని విజ్ఞప్తి

ప్రచురణార్థం / ప్రసారార్థం :
తేది. 10.10.2014
హైదరాబాదు

                తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్‌ రంగంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న 20వేల మంది కాంట్రాక్ట్‌ కార్మికులు గురువారం నుండి నిరవధిక సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మెకు సిపిఐ(యం) తెలంగాణ కమిటీ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రియే స్వయంగా విద్యుత్‌ శాఖ కూడా చూస్తున్నారు. సమస్య తీవ్ర రూపం దాల్చకముందే జోక్యం చేసుకుని, కార్మికుల సమస్యలు పరిష్కరించి, సమ్మె విరమింపజేయాలని కోరుతున్నాము. కార్మికుల కోర్కెలు న్యాయపరమైనవే. పైగా ఎన్నికల సందర్భంగా టిఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో పేర్కొన్నవన్న విషయం గుర్తించాలని
శ్రీ తమ్మినేని గుర్తుచేసారు.
                  కాంట్రాక్ట్‌ కార్మికులందరిని పర్మినెంట్‌ చేయాలని, పర్మినెంట్‌ చేసేలోగా సమానపనికి సమానవేతనం ఇవ్వాలని, కాంట్రాక్ట్‌ వ్యవస్థను రద్దు చేసి విద్యుత్‌ సంస్థలలో కార్మికులకే నేరుగా జీతాలు ఇవ్వాలని, మే నెలలో జెఏసీతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా కాంట్రాక్ట్‌ కార్మికులకు ఇస్తానన్న 10శాతం ఐఆర్‌ను వెంటనే ప్రకటించాలని కోరుచున్న డిమాండ్లు చాలా న్యాయసమ్మతమైనవి. కావున కెసిఆర్‌ వెంటనే జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించాలని తమ్మినేని కోరారు.

No comments:

Post a Comment